రసం దోషం పొందిన కలుగు వ్యాధులు -
శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ - * రసం దోషం పొందిన కలుగు వ్యాధులు - అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం , శరీరం నొప్పులు , జ్వరం, గుండెపీకుట , వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం , శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు , పాండురోగం , శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును. * రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - కుష్టు , విసర్ప, పిడక ,మశక ,నీలిక , తిలకాలకా, నశ్చ , వ్యంగ అను చర్మవ్యాధులు , పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు , విద్రది అను వ్రణం , గుల్మవాతం, శోణిత, క్యాన్సర్ , రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును. * మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - ఆసనము , నోరు , నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు , కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు , గలగండిక ( టాన్సిల్...